టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ మాస్ దర్శకుడు అయినటు వంటి బోయపాటి శ్రీను దర్శకత్వం లో తేరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు తో పాటు కన్నడ ,  మలయాళ , తమిళ , హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయ బోతున్నారు . 

ఇలా ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనుండడంతో ఈ మూవీ లో ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడి ని తీసు కోవాలి అని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది . అందులో భాగం గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటు వంటి అనిల్ కపూర్ ని ఈ మూవీ లో తీసుకోవాలి అని మూవీ యూనిట్  ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది . ఈ మూవీ లో రామ్ పోతినేని తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది . 

అలాగే ఈ మూవీ ని తండ్రి కొడుకుల మధ్య ఉండే సెంటి మెంట్ తో తెరకెక్కించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సరికొత్త లుక్ లో కనబడడం కోసం రామ్ పోతినేని కొంత బరువును కూడా పెరగడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రామ్ పోతినేని 'ది వారియర్' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఇక బోయపాటి శ్రీను పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ కి దర్శకత్వం వహించాడు. అఖండ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: