
ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా విడుదలకు సిద్ధమవుతోంది. దసరా పండుగను పురస్కరించుకొని నవంబర్ 4వ తేదీన థియేటర్లోకి తీసుకొస్తామని విడుదల తేదీని ప్రకటించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఒక సరికొత్త అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా వదిలారు. ఇందులో సంతోష్ మరియు ఫరియా బ్రీఫ్ కేసులపై కూర్చుని ఉన్నారు. వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. రొమాన్స్ మరియు సస్పెన్స్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. ఇందులో యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేసి మంచి ట్రావెల్ బ్లాగర్ అనిపించుకోవాలని కుతూహలం వున్న యువకుడిగా సంతోష్ కనిపించనున్నారు.
సంతోష్ ఎంపిక చేసుకున్న కథ , కథాంశం రెండూ కూడా ప్రేక్షకులకు నచ్చాయి ..మరి ఈ సినిమాతో నైనా ఆయన విజయం సాధిస్తారో లేదో తెలియాల్సి ఉంది. నిజానికి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఏ హీరో అయినా సరే మంచి విజయాన్ని అందుకుంటారు. మరి సంతోష్ శోభన్ కి ఈ సినిమా ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాను ఆముక్త క్రియేషన్స్ తో కలిసి నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.