రాజకీయాలన్నాక ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు 2 సీట్లు వచ్చిన బీజేపీ ఇప్పుడు రెండు సార్లు వరుసగా పూర్తి మెజారిటీతో  మొత్తం దేశాన్ని పాలిస్తోంది.

ఇక ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్ ను తోసిరాజని ప్రధాన ప్రతిపక్షంగా.. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేసిన టీడీపీ ఇప్పుడు ముక్కి మూలిగి ఏపీకే పరిమితమైంది. అందుకే రాజకీయాల్లో ఎవరి ఫేటునైనా ప్రజలు ఇట్టే మార్చేస్తారు. ప్రజల్లో ఉంటూ పోరాడితే రాజ్యాధికారం అప్పగిస్తారు.

 

ఉమ్మడి ఏపీలో నాడు వైఎస్ఆర్ కుట్రలకు బలై ఉనికి కోల్పోయిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆయన మరణం తర్వాత తెలంగాణ సాధించి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు మరీ. మూడోసారి ఏకంగా జాతీయ రాజకీయాల లోకి వెళ్లాలని ఉన్నారు . బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిస్తున్నారు.

ఇక గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల్లోకి విస్తృతంగా వెళుతూ ఆర్థిక సాయం చేస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని తోసిరాజని జనసేన ఎదుగుతోంది ప్రచారం బాగానే ఉంది . వచ్చేసారి ఏపీలో కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్ అవతరించడం గ్యారెంటీ అంటున్నారు ప్రేక్షకులు .

ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో భాగంగా ఏపీలో ఆయనకు పవన్ కళ్యాణ్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒకప్పుడు తన బాస్ అయినా కూడా కేసీఆర్ బాబును నమ్మి ఆయనపై నమ్మకంతో రాజకీయాలు చేయలేని పరిస్థితి. ఇక వైసీపీ తిరుగులేకుండా ఉంది. ఆ పార్టీ పొత్తు పెట్టుకొని పోటీచేసే రకం కాదు. ఒంటరిగానే వెళ్లగలదు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ 'బీఆర్ఎస్' ఏపీలో జనసేనతో పొత్తుకు ఎదురుచూస్తోంది. పవన్ కళ్యాణ్ తో కేసీఆర్ పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేయాలని చూస్తున్నారు.

 ఏపీలో కేసీఆర్ 'బీఆర్ఎస్'కు పెద్దగా ఆశలు లేవు. అది జనసేన ఓటు బ్యాంకుపైనే ఆధారపడి పోటీచేయడానికి రెడీ అవుతోంది మరీ . ఆంధ్రా విడిపోవడానికి కారణమై.. ఇప్పుడు సమస్యలకు కేసీఆరే కారణమని అక్కడి ప్రజల్లో వాదన ఉంది. అందుకే బీఆర్ఎస్ కు ఏపీలో మనగడ కష్టమే అని అంటున్నారు . అందుకే పవన్ కళ్యాణ్ తో కేసీఆర్ పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లలో అయినా ప్రభావం చూపాలని యోచిస్తున్నారు అంటా, మరి ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది  మనం వేచిచూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: