తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినా సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంతోష్ శోభన్ "పేపర్ బాయ్" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏక్ మినీ కథ , మంచి రోజులు వచ్చాయి మూవీ లతో సంతోష్ శోభన్ తన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ శోభన్ "లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో జాతి రత్నాలు ఫేమ్ ఫారీయా అబ్దుల్లా , సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా నటించగా , మేర్లపాక గాంధీ ir మూవీ కి దర్శకత్వం వహించాడు.  సెప్టెంబర్ 4 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. 

వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటనను చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ,  ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి నాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటివరకు మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: