టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద చిత్రాలకు , సోషల్ మీడియా పోస్ట్ ల కు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక తాజాగా గురువారం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే బుధువారం ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినా వర్మ..నెక్స్ట్ డే నే కొత్త చిత్రాన్ని ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.ఇకపోతే 'నేను అతి త్వరలో 'వ్యూహం' అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇక ఇది బయోపిక్ కాదు.అంతేకాదు  బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్.ఇక  బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు. 

కానీ  ఇక రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయి.' అంటూ సోషల్ మీడియా వేదికగా చేసారు వర్మ. అయితే ఇక ఒక్క పోస్ట్  తో ఆగలేదు. అంతేకాదు వరుస పెట్టి పోస్టులు చేసి రాజకీయంగా చర్చ కు దారితీసారు.అయితే 'అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన 'వ్యూహం' కథ.. రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది.ఇక  రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే 'వ్యూహం' చిత్రం.'అయితే  అని మరో పోస్ట్  చేశారు. ఈ చిత్రం 2 పార్ట్స్‌గా రాబోతుంది.. మొదటి పార్ట్ 'వ్యూహం', 2nd పార్ట్ 'శపథం'.. 

రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.ఇక  రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం ' షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 'శపథం 'లో తగులుతుంది.అయితే  అని మూడో పోస్ట్  చేశారు. 'వ్యూహం 'చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్.ఇక  ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. ఏం చెప్పాలో.. ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు అని మరో పోస్ట్  చేశారు. అయితే మొత్తం మీద వర్మ వరుస పోస్ట్ రాజకీయంగా చర్చ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV