ఈ మధ్యకాలంలో సరైన క్రైమ్ థ్రిల్లర్ లు లేక మొహం వాచిపోయిన తెలుగు ప్రేక్షకుల కోసం 'తగ్గేదేలే' అంటూ ఒక ఆసక్తికరమైన కథనంతో వస్తున్నాడు నవీన్ చంద్ర. కొద్దిసేపటి ముందు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం..!ట్రైలర్ మొదట్లోనే నవీన్ చంద్ర ఒక శవం వద్ద అనుమానస్పదంగా కనిపిస్తాడుఅయితే ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా రాజా రవీంద్ర, రవిశంకర్ కనిపిస్తారు. వీరు నవీన్ చంద్రను అనుమానిస్తూ అదే కోణంలో విచారణ జరుపుతుంటారు.

అయితే కథలో 'దండుపాళ్యం' గ్యాంగ్ ఎంటర్ కావడం పెద్ద ట్విస్ట్ లాగా కనిపిస్తుంది. నవీన్ చంద్ర ప్రేమ, పెళ్లి వ్యవహారాలు, వరుస హత్యలు... వీటన్నింటికీ 'దండుపాళ్యం’ గ్యాంగ్ కీ ఉన్న సంబంధం ఏమిటి..? అసలు ఈ రెండు కథలు ఎలా కలుస్తాయి అన్న ఆసక్తికర అంశంపై ఈ చిత్రం మొత్తం రూపొందించినట్లు కనిపిస్తోంది.

సూపర్ హిట్ క్రైమ్ సిరీస్ 'దండుపాళ్యం' కు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాజు ఈ చిత్రానికి డైరెక్టర్. తన ట్రేడ్ మార్క్ క్రైమ్ సీక్వెన్స్ లతో పాటు ఎన్నో ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఈ చిత్రంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'దండుపాళ్యం' గ్యాంగ్ ఈ కథనంలో మమేకం కావడం మనకు పెద్ద హైలైట్ గా కనిపిస్తోంది.నంది అవార్డు గ్రహీత వెంకట్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ తో పాటు చిన్నా నేపథ్య సంగీతం, రైటర్ శివ సాయి డైలాగ్స్ ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు నిమిషాల ట్రైలర్ లో కామెడీ, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలు సమపాళ్ళలో ఉండడం అనేది పెద్ద ప్లస్ పాయింట్.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'తగ్గేదేలే’ చిత్రాన్ని భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, పురిపాటి వెంకట సుబ్బారెడ్డి, నందలూరి అఖిలేష్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: