మస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ధమ్కీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో విశ్వక్ సేన్ లుక్స్ ,  డ్రెస్సింగ్ స్టైల్ , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నివేత పేతురాజ్ , విశ్వక్ సేన్  సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో పాగల్ మూవీ తెరకెక్కింది. పాగల్ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే పాగల్ మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా దమ్కి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల" అనే తెలుగు లిరికల్ వీడియో సాంగ్ ను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ మరియు నివేద పేత్ రాజ్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. విశ్వక్ సేన్ ఇప్పటికే ఈ సంవత్సరం అశోకవనంలో అర్జున కళ్యాణం , ఓరి దేవుడా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా పర్వాలేదు అనే రేంజ్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: