
మరొకవైపు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. అయితే వారు ఏబీఎమ్ కాలేజ్ గ్రౌండ్ నుంచి అర్జున్ ఇన్ఫ్రాకు వేదికను మార్చి ఈరోజు సాయంత్రం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మరొకవైపు చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక రద్దయింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో త్వరగా వేదికను ఫిక్స్ చేయాలి అని చిత్ర బృందం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగో ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కాబట్టి వైజాగ్ లోనే ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంచుకున్నట్లయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇకపోతే చిరంజీవితో అన్నయ్య చిత్రం తర్వాత బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమాలో చిరంజీవి పక్కన రవితేజ కూడా నటిస్తున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జనవరి 13వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు పోటీగా దిగబోతోంది. మరి ఈ రెండింటిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.