ఇటీవల హీరోయిన్లు ఎక్కువగా విలన్లను ప్రేమిస్తూ ఉన్నారు.అలాగే పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్ హరిప్రియ కేజిఎఫ్ విలన్ వశిష్ట తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది తాజాగా ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు గడిచిన కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సంగతి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలో మరొక హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రేమమ్ ఫేమ్ హీరో నవీన్ పాలి నటించిన ఒక మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత విశాల్ నటించిన యాక్షన్ చిత్రంలో ఈమె తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలాగే సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ మొదటి భాగంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఒక విలన్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఐశ్వర్య లక్ష్మీ డేటింగ్ చేస్తున్న విలన్ ఎవరో కాదు తమిళనటుడు అర్జున్ దాస్.


డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మాస్టర్, విక్రమ్ సినిమాలలో విలన్ గా నటించారు. ఇక తెలుగులో రీమేక్ అవుతున్న బుట్ట బొమ్మ సినిమాతో అర్జున్ దాస్ తెలుగులో అడుగుపెడుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఐశ్వర్య లక్ష్మి షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూసిన నేటిజన్లో  సైతం వీరిద్దరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ఈ ఫోటో ఏ సినిమాలోది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమా పెళ్లి పెద్దలు కుదిరిచిన వివాహం పై ఐశ్వర్య లక్ష్మి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మరి అసలు విషయాన్ని ఎప్పుడు తెలియజేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: