
అంతేకాదు జూనియర్ సమంత అనే పేరు కనుమరుగైపోయి ఇక అషు రెడ్డి ఆర్జీవి బ్యూటీ అనే ఒక కొత్త పేరు తెరమీదకి వచ్చింది. ఎందుకంటే సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో హాట్ ఇంటర్వ్యూలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో ఇక బుల్లితెరపై ఎన్నో ఈవెంట్లలో కూడా పాల్గొని రచ్చ రచ్చ చేసి ప్రేక్షకులు తనను మర్చిపోకుండా చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక గతంలో కామెడీ స్టార్స్ అనే కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరించి పటాస్ హరి తో లవ్ ట్రాక్ నడిపి కూడా కాస్త పాపులారిటీ సంపాదించింది..
ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తూ ఇక నేటిజన్స్ చూపులను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఇటీవలే ఒక డైలాగ్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని నిత్యామీనన్ చెప్పే డైలాగ్ పై ఒక రీల్ చేస్తుంది అషు రెడ్డి. నాకు పెళ్లయితే వారంలోపే నా మొగుడిని కాపీలో విషం పెట్టి చంపేస్తాను అని ఒక డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఇదే డైలాగ్ ని బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి చెబుతుంది. అయితే ఇక ఈ వీడియో పై అటు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే నీ భర్తను అలా చంపేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.