ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈమె బుట్ట బొమ్మ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమె తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో ఎక్కువగా నటించింది 2010లో మలయాళం సినిమా కథ తుదరున్ను అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె తమిళ సినిమాలైనా ఎంతవాడుగానీ, విశ్వాసం వంటి సినిమాలలో అజిత్ కి కూతురిగా.. మమ్ముట్టి నటించిన మలయాళం సినిమా గ్రేట్ ఫాదర్ సినిమాలో కూడా మమ్ముట్టి కూతురుగా నటించి అలరించింది.

అయితే ఈ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో అనిఖా సురేంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు అయ్యింది. ఇదిలా ఉండగా అనిఖా కేరళలోని ముంజేరిలో 2004 నవంబర్ 27వ తేదీన జన్మించింది. కేవలం తెలుగు , తమిళ్,  మలయాళం సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు ఒకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరొకవైపు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిన 2018లో వచ్చిన మా షార్ట్ ఫిలింలో అమ్ము క్యారెక్టర్ పోషించి భారీగా పాపులారిటీ దక్కించుకుంది.

ఆ తర్వాత 2019లో రాణి అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా ఈమె గాయనిగా కనిపించింది. అవార్డుల విషయానికి వస్తే 2013లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులో భాగంగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు సొంతం చేసుకుంది . అలాగే 2011,  2018 లో కూడా ఏసియా నెట్ ఫిలిం అవార్డులో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న ఈమె జే ఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2020లో కూడా విశ్వాసం సినిమా కోసం అవార్డు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: