రానా వెంకటేష్ లు కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు బాగా ఉండటంతో దానికి తగ్గట్టుగా వెంకటేష్ రానా లు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెంచుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ రానా లు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు.


వెంకటేష్ పాత్ర పేరు ‘నాగ’ అయితే రానా పాత్ర పేరు ‘రానా నాయుడు’. ఈకథలో పెద్దపెద్ద బిజినెస్ లు చేస్తూ కొన్ని పరిస్థితులు వల్ల ఆర్థికంగా నష్టపోయిన వారికి సహాయంగా ప్రవేట్ సెటిల్మెంట్ లు చేసే సెటిల్మెంట్ హీరోగా రానా కనిపిస్తాడు. సాధారణంగా కార్పోరేట్ స్థాయిలో ఉండే 100 కోట్ల అప్పుల గురించి అక్కడి సెటిల్మెంట్స్ గురించి సగటు ప్రేక్షకుడుకి పెద్దగా తెలియదు. ఈవిషయాన్ని ఆధారంగా తీసుకుని ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.


అయితే కార్పోరేట్ వ్యక్తులు పైకి హుందాగా కనిపిస్తున్నప్పటికీ ప్రవేట్ జీవితంలో ఎలాంటి బూతులు ఆడుతూ ఉంటారు అన్న కోణాన్ని ఆధారంగా తీసుకుని కార్పోరేట్ దిగ్గజాల వ్యక్తిగత జీవితాలను పరోక్షంగా చూపిస్తూ ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ లోని తమ పాత్రల స్వభావం రీత్యా హిందీ డైలాగ్స్ లో కొన్ని బూతులు వచ్చిన విషయం వాస్తవమే అని చెపుతూ అయితే ఆబూతుల డైలాగులు తెలుగు వెర్షన్ వచ్చేసరికి కొద్దిగా అతిగా అనిపిస్తాయని రానా అభిప్రాయ పడ్డాడు.


ఒక సందర్భంలో తమ పాత్రల స్వభావం రీత్యా తాను తన తండ్రి పాత్రలో నటిస్తున్న వెంకటేష్ తో బూతు డైలాగులు పలకడానికి ఇబ్బంది పడ్డ విషయాన్ని ప్రస్తావించాడు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ ను వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కలిసి చూడవద్దని రానా చెపుతున్నాడు. దీనితో ఈబూతు వెబ్ సిరీస్ ఎంతవరకు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: