‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డుల స్థాయికి చేరుకోవడంతో చరణ్ జూనియర్ ల పేర్లు హాలీవుడ్ స్థాయిలో మారుమ్రోగి పోతున్నాయి. అయితే హాలీవుడ్ లో రామ్ చరణ్ తనకు తానుగా తన ఇమేజ్ ని పెంచుకోవడం కోసం బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చరణ్ తన కెరియర్ మొదటిరోజులలో నటించిన ‘జంజీర్’ రీమేక్ లో ప్రియాంక తో కలిసి నటించాడు. అయితే ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ముగిసిపోయింది అనుకున్నారు.

 

 

అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో చరణ్ పేరు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదిగి పోవడంలో ప్రియాంక వ్యూహాలు చరణ్ కు బాగా కలిసి వచ్చాయి అని అంటున్నారు. ప్రియాంకకు హాలీవుడ్ లో చాల పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు ఆమె ఒకసారి ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కు హోస్ట్ గా కూడ వ్యవహరించింది. ఈ పరిచయాలతో చరణ్ ను చాలామంది హాలీవుడ్ సెలెబ్రెటీ లకు ప్రియాంక వ్యక్తిగతంగా పరిచయం చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

 

 

అంతేకాదు చరణ్ అంగీకరిస్తే ఒక భారీ హాలీవుడ్ మూవీ ప్రాజెక్ట్ లో చరణ్ కు ఒక కీలక పాత్ర వచ్చే విధంగా ప్రియాంక కొందరితో రాయబారాలు చేస్తోంది అంటూ కూడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇచ్చిన ఇమేజ్ తో చరణ్ ఒక భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించగలిగితే అతడు త్వరలోనే ఇంటర్ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోతాడు.

 

 

ఇప్పటికే ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరొక వైపు బాలీవుడ్ పై కన్నేసిన చరణ్ ఆలోచనలు అన్నీ విజయవంతం అయితే ఇక అతడి కెరియర్ కు ఎదురు ఉండదు. ఇప్పటికే రామ్ చరణ్ కోసం ప్రత్యేకమైన పిఆర్ టీమ్ లు బాలీవుడ్ లో ఉన్నాయి అంటారు. ఇప్పుడు చరణ్ ఇంటర్ నేషనల్ స్టార్ గా మారిపోతే తెలుగులో అతడు చేసే సినిమాల సంఖ్య బాగా తగ్గే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: