మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ క్రేజీ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ లవర్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షారుక్ ఖాన్ ఇప్పటికే ఎన్నో హిందీ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం హిందీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ... సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

దీపిక పాడుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని మార్చి 22 వ తేదీ నుండి హిందీ , తెలుగు , తమిళ భాషలలో అమెజాన్ ప్రైమ్ సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనుంది. మరి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ "ఓ టి టి" విడుదల కోసం ఎంతో మంది సినీ ప్రేమికులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: