గత కొంతకాలం నుంచి సౌత్ సినిమాలు ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు తమిళ భాషల్లోనే కాదు అటు హిందీలో కూడా సంచలన వసూళ్ళని సాధిస్తూ సత్తా చాటుతూ ఉన్నాయి. దీంతో ఇక ఇప్పుడు సౌత్ సినిమా అంటే అటు భారతీయ సినిమాగా పేరు సంపాదించుకుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఒకప్పుడు భారీ కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ సినిమాల మాత్రం ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్ నటించిన ఒక్క పటాన్ సినిమా మినహా మిగతా ఏ సినిమా కూడా పెద్దగా సత్తా చాటలేకపోయింది.


 దీంతో ఇక సౌత్ సినిమాల విజయాలను చూసి బాలీవుడ్ లో ఉన్న క్రిటిక్స్ ఓర్వలేక పోతున్నారు అని చెప్పాలి. దీంతో ఏదో ఒక విధంగా విమర్శలు చేయడం లాంటివి కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. అయితే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం పై ఇటీవల స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. సరైన సినిమాలు తీయకపోతే ఎలా హిట్ అవుతాయి అంటూ ప్రశ్నించాడు సల్మాన్ ఖాన్. ఇక సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 నేను ఇదివరకే ఎన్నోసార్లు చెప్పాను. సినిమా సరిగ్గా తియ్యకపోతే ఎలా ఆడతాయి. ఎవరైనా సినిమా తీస్తున్నారు అంటే అందరూ ఆ సినిమా ముఖల్ ఈ అజాం, హం ఆప్కే హై కౌన్ ఇలాంటి క్లాసిక్స్ తీస్తున్నారని అనుకుంటారు. కానీ అలా జరగలేదు.. అందుకే సినిమాలు ప్రేక్షకులు అంచనాలు అందుకోలేకపోతున్నాయి  అని కామెంట్ చేశాడు సల్మాన్ ఖాన్.  సల్మాన్ ఖాన్ ఇటీవల కిసిక భాయ్ కీసిక జాన్ అనే సినిమాలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రమోషన్స్ లో ఇక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: