టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ క్రెజియస్ట్ బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది.

అరవింద స్వామి ... ప్రియమణిమూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు చైతన్య "దూత" అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే దూత వెబ్ సిరీస్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అలాగే కస్టడీ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యే చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. దీనితో చైతు తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా శివ నార్వణ తో చైతు తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మజిలీ అనే బ్లాక్ బాస్టర్ మూవీ రూపొందింది.  శివ నర్వాన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా ఖుషి అనే మూవీ ని రూపొందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: