టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలం లో నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టాయి . పోయిన సంవత్సరం నాగ చైతన్య ఏకంగా మూడు మూవీ లలో హీరో గా నటించాడు. అందులో బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... థాంక్యూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర లో రూపొందిన హిందీ సినిమా లాల్ సింగ్ చడ్డ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించ లేక పోయింది. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను అలరించిన నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించాడు.

 వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియమణి ... అరవింద స్వామి కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు ... తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ నిర్వహించడానికి ప్లాన్స్ చేస్తున్నారు.

 అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు చెన్నై లో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించడానికి ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా అంటే ఈ మూవీ పై ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: