తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్నంతమంది ప్రముఖ హాస్య నటులు ఇప్పుడు లేరు. బ్రహ్మానందం ఎమ్ఎస్ నారాయణ ధర్మవరపు సుబ్రమణ్యం సునీల్ వేణు మాధవ్ అలీ లాంటి కమెడియన్ హీరోలతో సమానంగా ఇమేజ్ ని తెచ్చుకుని వందల కొద్ది సినిమాలలో నటించి మెప్పించారు. ఆ సీనియర్ కమెడియన్స్ లో కొందరు చనిపోతే మరికొందరు సినిమాలలో పెద్దగా కనిపించడంలేదు.


ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించిన కామెడీ అధ్యాయాన్ని వెన్నెల కిషోర్ సప్తగిరి ప్రియదర్సి రాహుల్ రామకృష్ణతో పాటు మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ తెలుగు సినిమా హాస్యానికి చిరునామాగా కొనసాగుతున్నారు. అయితే వీరందరి కామెడీ టైమింగ్ కు ప్రేక్షకుల నుండి ఆదరణ లభిస్తున్నప్పటికీ వీరిలో చాలామంది హీరోలుగా సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ఎక్కువకాలం వీరు కామెడీ రోల్స్ చేస్తారా అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితుల మధ్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి కమెడియన్ లభించాడు అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అతని పేరు అభినవ్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా నుండి అందరికి పరిచయం అయిన అభినవ్ కామెడీ టచ్ కు సరైన పాత్రలు ఇప్పటివరకు లభించలేదు అని అంటారు.


అయితే లేటెస్ట్ గా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో అభినవ్ కామెడీ టైమింగ్ ను చూసి చాలామంది అతడికి అభిమానులుగా మారిపోతున్నారు. అంతేకాదు ఆ వెబ్ సిరీస్ కు అంత విపరీతమైన పేరు రావడానికి అభినవ్ కామెడీ ప్రధాన కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులలో అతడికి పెరిగిపోతున్న క్రేజ్ ను పరిశీలిస్తే రానున్న రోజులలో అతడు టాప్ కమెడియన్ గా ఎదిగినా ఆశ్చర్యంలేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో అభినవ్ ఒకప్పటి సీనియర్ కమెడియన్స్ స్థానాన్ని అందుకుని కొంతకాలం ఇండస్ట్రీని కమెడియన్ గా సాసిస్తడా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: