మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావం నేటితరం పై విపరీతంగా ఉంది. సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చే వరకు ఆ వార్త నిజం అయినప్పటికీ నమ్మే స్థితిలో నేటి సమాజం లేదు. ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవడానికి అనేక మల్టీ నేషనల్ కంపెనీలు సినిమా నిర్మాణ సంస్థలతో పాటు ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడ ప్రయత్నిస్తున్నాయి.



ఇలాంటి పరిస్థితులలో పేరున్న ప్రతి సెలెబ్రెటీ తమ పేరును క్యాష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో సోషల్ మీడియా కూడ బాగా సహకరిస్తోంది. ప్రస్తుతం చాలామంది తెల్లవారితే చాలు ఇన్ ష్టా గ్రామ్ ను చూడకుండా ఉండలేక పోతున్నారు. తమకు ఇష్టమైన సినిమా తారలు క్రికెటర్లు పెట్టే పోష్టులు చదువుతూ లైక్ లు కొట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి నేపధ్యంలో ఫిలిం సెలెబ్రెటీలు క్రికెట్ హీరోలు ఇన్ ష్టా గ్రామ్ లో పెట్టే పోష్టులకు కోట్లాది రూపాయలు ఆదాయం పొందుతున్నారు అన్నవిషయం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.



ఈలిస్టులో ప్రధమ స్థానంలో ఉంది విరాట్ కోహ్లీ ఇతడి ఎకౌంట్ లో ఒక ప్రోడక్ట్ బాగుంది అని ఒక పోష్ట్ పెట్టడానికి అతడు మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడనే ప్రచారం ఉంది. ఇతడికి 250 మిలియన్స్ ఫాలోయర్స్ ఉండటంతో అతడికి ఆ రేంజ్ లో పారితోషికం అందుతోంది. ఈ లిస్టులో బాలీవుడ్ సెలెబ్రెటీలు ప్రియాంక చోప్రా అలియా భట్ లు కూడ ఉన్నారు. వీరు పెట్టే ఇన్ ష్టా గ్రామ్ పోష్టులకు కూడ కోట్లల్లో పారితోషికం వస్తోంది.


ఇప్పుడు ఈ మార్కెట్ పై మన తెలుగు సెలెబ్రెటీల కన్ను పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్న అల్లు అర్జున్ మహేష్ రామ్ చరణ్ లు తమ ఫాలోయర్స్ సంఖ్యను మరింతగా పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. వీరి సహాయంతో దక్షిణాదిలో ఈ టాప్ హీరోలకు ఫాలోయర్స్ బాగా పెరిగితే వీరు కూడ ఇన్ ష్టా గ్రామ్ లో పోస్ట్ చేసే పోష్టులకు కోట్లు కొల్లగొట్టాలని ఒక మాష్టర్ ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: