పూనం కౌర్... చేసిన సినిమాలు ఏమీ లేకపోయినా ఆమెకు వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే వ్యాఖ్యలు ఆమెకు తెలుగులో ఉన్న సంబంధాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఆమె గురించి ఎప్పుడు ఏదోక వార్త వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఒక రాజకీయ నాయకుడి తో వచ్చింది ఆమె తెలుగు దేశం ప్రభుత్వం ఉండగా ప్రభుత్వంలో ఒక పదవి కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో నటించాలి అని భావిస్తున్నట్టు సమాచారం. 

 

ఆమెకు అవకాశం ఇవ్వాలని కొందరు దర్శకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఆఫర్ ఇచ్చారని కూడా సమాచారం. ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారట తాను క్రిష్ దర్శకత్వంలో చేసే సినిమాకు గానూ ఆమెను తీసుకోవాలని పవన్ భావించారని టాక్. ప్రస్తుతం ఆమె ఆ సినిమాలో పాత్రకు రెడీ అవుతుంది అని సమాచారం. ఆమె టాలీవుడ్ లో ఏ సినిమా చెయ్యాలి అని అనుకుంటున్నా సమయంలో పవన్ ఆమెకు ఆఫర్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం తెలుగులో సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. 

 

సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. మరో సినిమాలో కూడా ఆమెకు ఆఫర్ వచ్చింది అని సమాచారం. ఆమె ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకుంది అని ప్రచారం జరుగుతుంది. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: