అతి వినయం ధూర్త లక్షణం అంటే అర్థం అందరికీ తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా వినయం గా ఉంటూ పొగడ్తలు చేసే వారిని ధూర్త లక్షణం కలిగి ఉన్నవారు, చెడ్డవారు అనే అపకీర్తి కలిగి ఉంటారు. ఆ విధంగా సినిమా పరిశ్రమలో ప్రతి చిన్న దానికి కూడా పెద్ద పెద్ద ఈవెంట్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ విధంగా మితి మీరిన ప్రమోషన్స్ చేస్తే అది ఫ్లాప్ కు దారితీస్తుంది అని అంటున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాలను చూస్తుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న దానికి కూడా ఈవెంట్ అని ప్రమోషన్ ప్రోగ్రాం అని పెడుతున్నారు.  గతంలో సినిమా ఈవెంట్ అంటే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉండేది. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అయితే సక్సెస్ మీట్ అనే మరొక ప్రోగ్రామ్ కూడా పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే పాట పాట కు సాంగ్ లాంచ్ ఈవెంట్ అని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని అలాగే ఆడియో లాంచ్ ఈవెంట్ అని రకరకాల ఈవెంట్ లను పెడుతూ తమ సినిమాను అతి గా ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు సదరు నిర్మాతలు. 

అయితే అతిగా ప్రమోట్ చేయడం కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది అని ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్న సదరు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా చూపించడం వల్ల ఆ సినిమాపై ప్రేక్షకుడికి విరక్తి పుట్టే అవకాశం కూడా లేకపోలేదు అని కొంతమంది సినిమా విశ్లేషకులు ఈ పరిణామాన్ని క్షుణ్ణంగా విశ్లేషించుకుంటున్నారు. మరి ఈ రకమైన ట్రెండ్ చిన్న సినిమాలకు కూడా పాకితే అది దేనికి దారి తీస్తుందో ఎలాంటి పరిణామాలకు వెళుతుందో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: