తెలుగు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అనగానే దర్శక ధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, కొరటాల శివ గురించే మాట్లాడుతుంటారు. స్టార్ హీరోలు కూడా వీళ్లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడీ జాబితాలో మరో దర్శకుడు కూడా చేరుతున్నారు. కామిక్ హిట్స్‌తో టాప్ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు అనిల్ రావిపూడి.
కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో సెపరేట్ మార్కెట్ సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. 'పటాస్, సుప్రీమ్' హిట్స్‌తో ఈ దర్శకుడికి మినిమం గ్యారెంటీ అనే ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత మహేశ్‌బాబుతో తీసిన 'సరిలేరు నీకెవ్వరు' హిట్‌తో అనిల్ రావిపూడి స్టార్ మారింది. వందకోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ హిట్‌తో అనిల్ టాప్ లీగ్‌లో చేరాడు.
అనిల్ రావిపూడి వరుసగా బడా హీరోలని డైరెక్ట్ చేసే అవకాశం అందుకుంటున్నాడు. ఇటీవలే బాలకృష్ణతో సినిమా అనౌన్స్ చేసిన అనిల్ రావిపూడి, తర్వాత పవన్ కళ్యాణ్‌ని కూడా డైరెక్ట్ చేస్తాడనే టాక్ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్, భీమ్లానాయక్'తో పాటు సురేందర్ రెడ్డి సినిమా ఉన్నాయి. ఈ మూవీస్ తర్వాత అనిల్ ప్రాజెక్ట్ మొదలు పెడతాడట పవన్.
అనిల్ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్-3' సినిమా తీస్తున్నాడు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ సినిమా పనులు మొదలుపెడతాడట అనిల్. ఇక ఈ మూవీ జానర్ అనిల్ మార్క్‌కి భిన్నంగా ఉంటుందని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్‌తో సినిమా కూడా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాడట అనిల్. మరి ఈ భారీ సినిమాలతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌కి వెళ్తాడో చూడాలి. మొత్తానికి అనిల్ రావిపూడి టాప్ దర్శకుల సరసన చేరిపోయారు. వరుస సినిమాలు చేస్తూ.. సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు. ఆయన దర్శకత్వం వహించబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాలని అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి