యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమా మంచి విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యింది.  విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను విడుదలైన ప్రతి చోట నుండి తెచ్చుకున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను కూడా రాబట్టింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించాడు... తాజాగా కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ ని చూసిన శంకర్... కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ గురించి స్పందిస్తూ...  స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, డైలాగ్స్,  యాక్టింగ్ అన్ని కూడా ఈ సినిమాలో బాగున్నాయి అని సోషల్ మీడియా ద్వారా శంకర్ తెలియజేశాడు.  

కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా గురించి శంకర్ చేసిన పోస్ట్ కు రిప్లై గా ప్రశాంత్ నీల్ స్పందిస్తూ...  తన సినిమాను గురువు లాంటి శంకర్ ప్రశంసించడం ఎంతో ప్రత్యేకం అని కే జి ఎఫ్ చాప్టర్ 2 దర్శకుడు ప్రశాంత్ నీల్ పోస్ట్ చేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్,  ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇక శంకర్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: