ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ప్రేమ వ్యవహారానికి శుభం కార్డు పడటంతో వారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ తో సహా మెగా కుటుంబ సభ్యులు అంతా ఈ ఫంక్షన్ కు వచ్చిన ఫోటోలను నెటిజన్ లు చాల ఆశక్తికరంగా చూశారు.


వీరి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది అని వార్తలు వచ్చిన వెంటనే గతంలో అల్లు అరవింద్ ఒక సందర్భంలో లావణ్య త్రిపాఠి ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వీడియోను కొందరు ఇప్పుడు బయటకు తీయడంతో అది కూడ వైరల్ గా మారింది. గతంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘చావుకబురు చల్లగా’ మూవీలో ఈమె హీరోయిన్ గా హీరో కార్తికేయ తో కలిసి నటించింది.


అప్పట్లో ఈ మూవీకి ప్రశంసలు వచ్చినప్పటికీ ఆమూవీ సక్సస్ కాలేదు. ఆమూవీని ప్రమోట్ చేస్తూ జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ ‘ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చింది ఇక్కడే ఓ తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిలైపోవచ్చు కదా’ అంటూ అరవింద్ జోక్ చేసాడు. అయితే అరవింద్ అప్పట్లో చెప్పిన మాటలను తూచ తప్పకుండా లావణ్య త్రిపాఠి ఆచరించి అరవింద్ కు ఎంతో సన్నిహితమైన మెగా కుటుంబానికి కోడలు అయింది అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలను చూసి జోక్ చేస్తున్నారు.


వీరిద్దరి పరిచయం ఇద్దరు యూరప్ లో కలిసి నటించిన ‘మిష్టర్’ సినిమాలో జరిగింది. అక్కడే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దీనితో యూరప్ తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ త్వరలో వీరి పెళ్ళి యూరప్ లో జరుగుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ కెరియర్ అంతంతమాత్రంగా ఉంది ఈ పెళ్ళి తరువాత అతడి అదృష్టం తిరుగుతుందేమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: