పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో నుండి హీరోయిన్ దీపిక పదుకొణెని తొలగించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, దీపిక మధ్య ఇష్యూ జరుగుతోంది. రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో దీపిక స్పిరిట్ సినిమా నుండి సైడ్  అయ్యింది. తను తప్పుకున్న తర్వాత సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం జరిగింది. దీంతో సందీప్ రెడ్డి వంగ దానికి కారణం ఫెమినిజం అంటూ చెప్పి చెప్పకనే దీపిక అని ఫైర్ అయ్యారు.

అయితే తాజాగా దీపిక పదుకొణె ఇన్ డైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా స్టోరీ లీక్ పై స్పందించింది. తను ఓ ఫ్యాషన్ షోలో మాట్లాడుతూ.. 'జీవితంలో బ్యాలెన్స్ డ్ గా ఉండాలంటే నిజాయితీ ఉండాలి. నేను నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను. నా మనసు చెప్పిన మాటలు మాత్రమే నేను వింటాను' అని దీపిక చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సందీప్ రెడ్డి వంగా మాటలకు దీపిక సమాధానం ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో దీపికా పదుకొణె ఒకరు. దీపికా పదుకొణె 2006లో ఐశ్వర్యా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కనడ సినిమా. ఈ సినిమాకు హీరోగా ఉపేంద్ర నటించారు. ఆ తర్వాత 2007లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా చాలా అవార్డులను సొంతం చేసుకుంది. బచ్న ఏ హాసినో సినిమాలో నటించింది. చాందిని, బిల్లు, లవ్ అజ్, కల్, చపాక్, పఠన్ సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఈ భామ ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో కూడా నటించింది. కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: