ఏంటి ఇది నిజమేనా.. శ్రీలీల రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా.. ఇంతకీ ఆమె పెట్టిన పోస్ట్ లో ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల వరుస ప్లాపులు వచ్చినా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.అలా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.అలా ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. అయితే ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పటినుండి శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రీలీల ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో పాటు కార్తిక్ ఆర్యన్ తల్లి కూడా ఓ ఈవెంట్లో మీ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలుగా రావాలనుకుంటున్నారు అనగా..


మా ఇంటికి ఓ డాక్టర్ కోడలిగా వస్తే బాగుంటుంది అని మాట్లాడింది.అయితే కార్తీక్ ఆర్యన్ తల్లి మాట్లాడింది శ్రీలీల గురించేనని ఎందుకంటే శ్రీలీల హీరోయిన్ మాత్రమే కాదు ఎంబిబిఎస్ చదువుతుంది కాబట్టి శ్రీలీలను ఉద్దేశించే కార్తిక్ ఆర్యన్  తల్లి అలా మాట్లాడింది అని చాలామంది కామెంట్లు చేశారు.ఇక అప్పటినుండి కార్తీక్ ఆర్యన్ శ్రీలీల లవ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటి శ్రీలీల గురించి తాజాగా మరో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే తాజాగా శ్రీ లీల లంగా వోని వేసుకొని, నగలు, కుంకుమ పెట్టుకుని అచ్చ తెలుగు ఆడపిల్లలాగా రెడీ అవ్వడంతో పాటు మరో అమ్మాయిని హాగ్ చేసుకుని దిస్ ఈజ్ బిగ్ డే అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫోటో కింద బిగ్ డే అని క్యాప్షన్ పెట్టడంతో పాటు శ్రీలీల గెటప్ కూడా అచ్చం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలా కనిపించడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి శ్రీలీల రహస్యంగా ఎంగేజ్మెంట్ ఏమైనా చేసుకుందా..ఈ పోస్ట్ అర్థం ఏంటి అని ఎన్నో కామెంట్లు పెడుతున్నారు.. అయితే శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోలేదని, శ్రీలీలకు ఇంకా పెళ్లి వయసు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: