
సుకుమార్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్ గురించి ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సుకుమార్ భార్య పేరు తబిత అనే సంగతి తెలిసిందే. తాజాగా సుకుమార్ తబిత 16వ పెళ్లిరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ 16 సంవత్సరాల ప్రయాణం గురించి తబిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ 16 సంవత్సరాలలో లెక్కలేనన్ని జ్ఞాపకాలు, ప్రేమ మరింత బలపడుతూనే ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చారు. భర్త, పిల్లల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆమె ఈ కామెంట్లు చేసారు. ఈ ప్రయాణంలో మమ్మల్ని కలిపి ఉంచిన ఆ దేవుడికి కృతఙ్ఞతలు మేము ఎప్పటికి ఇలాగే సంతోషంగా ఉంటామంటూ ఆమె పోస్ట్ చేసారు. తబిత షేర్ చేసిన ఈ పోస్ట్ కు 18 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించారనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాతో ఈ దర్శకుడు చరిత్ర సృష్టించారు. సుకుమార్ భార్య తబిత నిర్మాతగా కూడా రాణిస్తూ విజయాలను అందుకుంటున్నారు. తబిత ఖాతాలో నిర్మాతగా మరిన్ని విజయాలు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శకుడిగా సుకుమార్ రేంజ్ అంతకంతకు పెరుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు