ప్రభాస్ మారుతి కాంబినేషన్లో ప్రస్తుతం ది రాజా సాబ్ అనే పాన్ ఇండియా మూవీ వస్తుంది.అయితే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ప్రభాస్ చిన్న డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ప్రభాస్ మారుతికి అవకాశం ఇచ్చారంటే ఆయన చెప్పిన కథ ప్రభాస్ కి ఎంతలా నచ్చిందో చెప్పనక్కర్లేదు. హార్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న ది రాజా సాబ్ మూవీ డిసెంబర్ లో విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ టీజర్ చూసి చాలామంది ప్రభాస్ అభిమానులు వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ మరొకసారి మనం తెరమీద చూడవచ్చు.చాలా రోజులుగా ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ సినిమాల్లోనే కనిపిస్తున్నారు. కామెడీని మిస్ అయ్యాం అనుకునే ప్రేక్షకులకు ది రాజా సాబ్ మూవీ ఫుల్ మీల్స్ అందిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు డైరెక్టర్ మారుతి.ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ తో నేను ది రాజా సాబ్ మూవీ స్టోరీ చర్చిస్తున్న సమయంలో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెట్టవచ్చు కదా.. చాలా రోజులుగా నా సినిమాల్లో సింగిల్ హీరోయిన్ ఉంటుందని, ఒకవేళ ఉన్నా కూడా వారితో సరైన సన్నివేశాలు రావడం లేదని ప్రభాస్ చెప్పాడు.

ఇక ప్రభాస్ కోరిక మేరకు ఆయన ఇద్దరు హీరోయిన్లను పెట్టమంటే నేను ఏకంగా ముగ్గురు హీరోయిన్లు పెట్టాను. ఈ సినిమాతో ప్రభాస్ కోరిక తీరుతుంది. ప్రభాస్ అడగడంతో ఇద్దరేం కర్మ ముగ్గురిని పెడతా అని మాటిచ్చాను అంటూ మారుతి చెప్పుకొచ్చారు.అయితే ప్రభాస్ ఇంతకుముందు నటించిన కల్కి సినిమాలో దిశాపఠాని,దీపిక పదుకొనే లు నటించారు. ఇందులో దిశా పఠాని తో ఎక్కువగా సీన్స్ ఉండవు.ఇక దీపికా పదుకొనే అయితే ప్రభాస్ తో సరిగా ఒక్క సన్నివేశంలో కూడా పడలేదు.

అలాగే సాహో సినిమాలో కూడా శ్రద్ధా కపూర్ తో అంతంత మాత్రం గానే సీన్స్ ఉంటాయి.ఇక ఆది పురుష్ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ ఎక్కడో లంకలో ఉంటుంది. సలార్ లో కూడా శృతిహాసన్ ప్రభాస్ కి అంత కెమిస్ట్రీ ఏమీ లేదు. అయితే ఇలా హీరోయిన్లు ఉన్నా కూడా కెమిస్ట్రీ లేకపోవడంతో బోర్ కొట్టి ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లు ఉండేలా వారితో సరైన సీన్లు పడేలా చేయమని డైరెక్టర్ కి చెప్పడంతో ప్రభాస్ కోరిక మేరకే ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ లని తీసుకున్నట్టు డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: