- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ # VT15 , టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో , UV క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లోనే  వెరీ స్పెషల్ , ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్‌–కామెడీ , ఇండియన్ & కొరియన్ బ్యాక్డ్రాప్ , యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి , గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు. షూటింగ్ చాలా స్పీడ్‌గా కంప్లీషన్ దిశగా వెళ్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజింగ్ సెషన్స్ శర వేగంగా జరుగుతున్నాయి.


తొలిప్రేమ ’ తర్వాత వరుణ్థమన్ కాంబో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఇవ్వబోతోంది. తొలి ప్రేమ మ్యూజిక‌ల్ హిట్ వెన‌క థ‌మ‌న్ వ‌ర్క్ చాలా హెల్ఫ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ లో మ్యూజికల్ హిట్ అవుతుంద ని అంచ‌నాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే రెండు ఎనర్జిటిక్ సాంగ్స్ షూట్ అయ్యాయి. ఇవి సినిమాకే హైలైట్స్ కానున్నాయి. నేప‌థ్య సంగీతం కూడా హైలెట్ కానుంద‌ట‌. త్వ‌రలోనే టైటిల్ , ఫస్ట్ గ్లింప్స్ అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: