పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి నుండి కూడా పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా పవన్ నటించిన ఓజి సినిమా ఇప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా ..? ఎప్పుడూ చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగినట్లు గానే ఈ మూవీ బృందం ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలన్నీ కూడా అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దానితో ఇప్పటికే ఈ మూవీ కి ఫ్రీ సేల్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది.

మూవీ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దానితో ఈ సినిమా ఈజీ గా ప్రీ సేల్స్ తోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని అదే గాని జరిగితే ఈ మూవీ విడుదలకు ముందు ప్రీ సేల్స్ ద్వారానే అద్భుతమైన రికార్డును సృష్టిస్తుంది అని చాలా మంది పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: