టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హీరోయిన్ సమంత రెండో వివాహం. డైరెక్టర్ రాజ్ నిడమోరును ఆమె  పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో, యూట్యూబ్ మీడియాలో, ఫిలిం నగర్ వర్గాల్లో రచ్చ రచ్చగా మారింది. సమంత, రాజ్ పెళ్లి జరిగిందని వార్తలు బయటపడిన క్షణం నుంచి, వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి నెటిజన్లు పరితపిస్తున్నారు. అంతేకాదు, కొందరు యూట్యూబర్లు, కొందరు జ్యోతిష్యులు కూడా ఇది తమ బిజినెస్ అవకాశంగా భావించి రోజు వారి లైవ్ సెషన్లలో వీరి జాతకాలు, పెళ్లి జంట భవిష్యత్తు, పిల్లలు పుడతారా? ఎలాంటి జీవితం ఉంటుంది? అన్న ప్రశ్నలతో హడావుడి చేస్తున్న పరిస్థితి.


ఇక ఈ వివాదాలన్నింటికి మరో మలుపు తీసుకొచ్చేలా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ  వీడియోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు వైరలవుతున్నాయి. “నన్నెందుకు అడుగుతున్నారు? సమంత - రాజ్ పెళ్లి గురించి..అంటూ వేణుస్వామి ఘాటు కామెంట్స్ చేశారు.



వేణుస్వామి మాట్లాడుతూ— “ఇప్పుడంతా నన్ను ఒకటే అడుగుతున్నారు… ‘సమంత జాతకం చెప్పండి, ఆమె – రాజ్ ల జీవితం ఎలా ఉంటుంది?’ అని. గతేడాది నాగ చైతన్య–శోభిత వివాహం వార్తలు వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాటలు  .. ఆ సమయంలో నేను మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పిన వారు ఇప్పుడు తమ  జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లి, ‘సమంత–రాజ్ కలిసి ఉంటారా? విడిపోతారా? పిల్లలు పుడతారా? మగపిల్లా, ఆడపిల్లా?’ అని అడుగుతున్నారు.ఇది నిజంగా విడ్డూరం, అసలు హాస్యాస్పదం కూడా.



సమంత కానీ… రాజ్ కానీ… వాళ్లు ఎవరైనా నన్ను వచ్చి తమ జాతకం చూడమని అడిగారా? వాళ్లే రాకుండా… బయట వాళ్లు మాత్రం తమకిష్టమైన ఊహాగానాలు తెర మీదకు తెస్తున్నారు. ‘మూఢములో పెళ్లి చేసుకున్నారు… అదృష్టం ఎలా ఉంటుంది?’ అని అడుగుతున్నారు. ఇది ఏంటి కామెడీ?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మూడు రోజులుగా ఓ పెద్ద పూజల్లో బిజీ… నాకు ఇవన్నీ అవసరం లేదు అని” – ఆయన తేల్చి చెప్పారు . వేణుస్వామి మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు..“నేను  మూడు రోజులుగా ఒక పెద్ద సినిమా సక్సెస్ అవ్వాలని మేకర్స్ చేసే పూజల్లో బిజీగా ఉన్నాను. అక్కడే క్యాంప్ చేస్తున్నాను. నాకు ఇలాంటి సెలబ్రిటీ గాసిప్స్, ఊహాగానాలు, ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడం—ఇవి ఏవీ నాకు అవసరం లేదు. నాకు తెలిసింది ఒకటే… వెంకటేశ్వర స్వామి, చిన్న మస్తాదేవి అమ్మవారు… వీరి మీద నమ్మకంతో నేను చేసే పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను.” అని తేల్చి చెప్పారు.



నెటిజన్ల రియాక్షన్ వేరేలా ఉంది. సమంత రాజ్ ల గురించి ఏదో చెప్తాడు అనుకుంటే ఇంకేదో చెప్పాడు ఏంటి..అని కొందరు.. “బాంబ్ పేల్చాడు రా వేణుస్వామీ అని మరికొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నరు.!”. వేణుస్వామి ఇంత ఘాటు టోన్‌లో మాట్లాడతారని ఊహించని నెటిజన్లు ఆయన వీడియోపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: