టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు లబ్దిదారులకు ఉన్న ఇళ్లు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానని సీఎం జగన్ కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తి అయినా రాష్ట్రంలో ఒక్క ఇళ్లయినా నిర్మించారా? పూర్తి అయిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ? అని డిమాండ్ చేసారు. శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ అతని బావమరిది జక్కంపూడి లో కోట్ల మేర కొండలు గుట్టలు కొట్టేశారు  అని మండిపడ్డారు.

లక్షల ట్రిప్పుల గ్రావెల్ ఎత్తుకెళ్లారని ప్రజలకు చూపించాలని వెళితే నాపై 505, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు అని మండిపడ్డారు. ఈ కేసులకు దేవినేని ఉమా భయపడడు అని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇది నిదర్శనం ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు ను కూడా కాలరాస్తుంది అని ఆయన విమర్శించారు. చట్టానికి అనుగుణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వచ్చే మూడు రోజులు పాటు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం మా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి నినాదంతో కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.

నియోజకవర్గ మండల గ్రామ తెదేపా నేతల ఆధ్వర్యంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు వినతిపత్రం అందజేసి రూట్ మ్యాప్ వారినే ఇవ్వమని కొరతాం అని ఆయన తెలిపారు. ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ సవాళ్ళు విసురుతూ బూతులు మాట్లాడడం సమంజసం కాదన్నారు. మైలవరం గతంలో ఇచ్చిన ఇళ్ళపట్టాలు తప్ప వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారో బయటపెట్టాలి అని డిమాండ్ చేసారు.  సీబీఐ ఈడీ కేసుల్లో ఉన్న వసంత ఎస్టేట్స్ డైరెక్టర్ ఎవరో చెప్పాలి అని ఆయన సవాల్ చేసారు.  శాసనసభ్యునిగా ప్రజలకు వసంత కృష్ణ ప్రసాద్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: