తెలుగుదేశం పార్టీకి , ఆ పార్టీ అధినేత‌కు ఇప్పుడు వైసీపీలో ముగ్గురు త్రిమూర్తుల ఫీవర్ పట్టుకుంది. వారిని వచ్చే ఎన్నికలలో ఓడిస్తే చాలు సగం గెలిచేసిన‌ట్టే అనుకుంటున్నార‌ట‌. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ఆ ముగ్గురు త్రిమూర్తులే చ‌ర్చ‌కు వ‌స్తున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి కోస్తాంధ్రలో బలమైన కమ్మ సామాజికవర్గం ఆ పార్టీకి ఎప్పుడూ కూడా అండగా ఉంటూ వస్తుంది. అలాంటిది గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గం ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ప‌డ‌లేద‌నే చెప్పాలి. అందుకే క‌మ్మ ల డామినేష‌న్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది.

గుడివాడ‌, దెందులూరు తో పాటు గుంటూరు జిల్లాలో ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేలు గెల‌వ‌డం.. అటు న‌ర‌సారావుపేట ఎంపీగా లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు గెల‌వ‌డ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇక క‌మ్మ‌లు డామినేట్ చేసే కృష్ణా జిల్లాలో ఇప్పుడు క‌మ్మ నేత‌లు కూడా టీడీపీకి దూర‌మై వైసీపీ లోకి వెళ్లి పోతున్నారు. కొడాలి నా ని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారే..!

ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీని వీడి వైసీపీ కి సానుభూతి ప‌రులుగా మారిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌లో కొడాలి నానిపై పోటీ చేసిన దేవినేని అవినాష్ ఆ త‌ర్వాత టీడీపీ ని వీడి వైసీపీ చెంత చేరిపోయారు. ప్ర‌స్తుతం అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు క‌మ్మ నేత‌ల దూకుడుతో చాలా మంది క‌మ్మ ఓట‌ర్లు , ప్ర‌జ‌లు ఇప్పుడు వైసీపీ చెంత చేరుతున్నారు.

అందుకే చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ముగ్గురిని ఓడిస్తే చాలు.. చాలా వ‌ర‌కు తాను స‌క్సెస్ అయిన‌ట్టే అని భావిస్తున్నార‌ట‌. అందుకే ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గా ల పై బాబు బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: