
మరి వసంత అధికార బలమో లేక టీడీపీని గెలిపించడం వల్ల ఉపయోగం లేదని మైలవరం ప్రజలు అనుకుంటున్నారేమో గానీ...పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వైసీపీని గెలిపించారు. సాధారణంగా కృష్ణా జిల్లా టీడీపీలో పెద్ద దిక్కుగా ఉండేది ఉమానే. అయితే ఉమా సొంత నియోజకవర్గంలో టీడీపీ కాస్త పోటీ ఇస్తుందని అంతా అనుకుంటారు. కానీ అలా జరగలేదు. ఉమాకు ఘోర పరాభవం జరిగింది.
ఉమా 2004లో నందిగామ ఎమ్మెల్యేగా గెలిచి...అప్పుడు వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నా సరే నందిగామలో స్థానిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకున్నారు. కృష్ణా అన్నీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా నడిచిన సరే...నందిగామ మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగిరేలా చేసుకున్నారు. అలాంటి ఉమా ఇప్పుడు మైలవరంలో సత్తా చాటలేకపోతున్నారు. పైగా ఇప్పుడు కొండపల్లి మున్సిపాలిటీ, జి-కొండూరు జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగనుంది. కొండపల్లి మున్సిపాల్టీ ఇప్పుడు ఉమా కు వసంతకు అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది.
ఒక మండలం, ఒక మున్సిపాలిటీలో ఎన్నిక అంటే దాదాపు సగం నియోజకవర్గం కవర్ అయిపోతుంది. అంటే ఈ రెండిటిలో టీడీపీ గెలవాలి...లేదంటే ఉమాకు మైలవరంపై పట్టు తగ్గినట్లు అవుతుంది. కానీ పరిస్తితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఈ రెండిటిల్లో కూడా వైసీపీ మళ్ళీ గెలిచేలా ఉంది. ఇటు అధికార, ఆర్ధిక బలంలో వసంతకు తిరుగులేదు. దాని బట్టి చూస్తే కొండపల్లి మున్సిపాలిటీలో, జి-కొండూరు జెడ్పీటీసీలో వైసీపీ గెలవడం, మరొకసారి వసంత చేతిలో ఉమా పరాభవం పొందడం ఖాయంగా కనిపించేలా ఉంది.