రాజకీయాల్లో నాయకులు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. గతంలో మాదిరిగా ఎడాపెడా మాట్లాడేసి.. ఆ మాట మీద నిలబడితే జనాలు పట్టించుకోకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు మీడియా హవా పెరిగాక ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ ఏదైనా మాట మాట్లాడి..దాని మీద నిలబడకపోతే జనం నిలదీస్తారు.. అలాగే మాట తప్పిన నాయకుడు చులకన అయిపోతారు. అయితే కాన్ఫిడెన్స్‌తో అన్నారో లేక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అన్నారో తెలియదు గానీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్...జగన్‌ని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలే చేశారు.

జగన్ మోహన్ రెడ్డి  మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, భగవంతుడు మంచివాళ్లకు ఎప్పుడూ తోడుగా ఉంటాడని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరించారని ధర్మాన చెప్పుకొచ్చారు. జగన్ మళ్ళీ సీఎం కావాలని అనుకోవడంలో తప్పులేదు కానీ.. ఆయ‌న ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందన్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇప్పుడు జగన్ పాలన గురించి జనాలు ఏం అనుకుంటున్నారో ధర్మానకు పూర్తిగా తెలియడం లేదు అనుకుంటా? అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ధర్మాన ఇక్కడ మంచి కామెడీ చేశారని, భగవంతుడు మంచివాళ్ళకు ఎప్పుడూ తోడుగా ఉంటారని అన్నారని, అవును అది నిజమే అని, కానీ జగన్‌కు తోడు ఉంటారో లేదో తెలియదని సెటైర్లు వేస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించారని ధర్మాన చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఆదరించారో కూడా తెలుసుకుంటే బాగుండేది అంటున్నారు.

ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఆ విజయాలు వైసీపీకి ఎలా వచ్చాయో అందరికీ తెలుసని, కేవలం అధికార బలంతో వచ్చిన విజయాలని, ప్రజా విజయాలు అనుకోవడమే కాస్త వింతగా ఉందని అంటున్నారు. కానీ మొత్తానికి ధర్మానని నెక్స్ట్ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో చూడటం కష్టమేనా అని సెటైర్లు వేస్తున్నారు. ఇంత కాన్ఫిడెన్స్‌గా డైలాగులు వేసిన ధర్మాన నెక్స్ట్ ఎన్నికల తర్వాత ఎక్కడ ఉంటారో చూడాలి అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: