ఒకనాడు మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు
ఇప్పుడు రౌడీ మినిస్టర్ ఎలా అయ్యారు

ఒకనాడు సౌమ్యతకు నెలవు
ఇప్పుడు కొడాలి నాని ఇమిటేటర్ గా ఎలా మారారు

ఒకనాడు వేదికలపై హంగామానే ఉండేది కాదు
కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇమిటేట్ చేస్తూ
భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు?
వీటిన్నంటి వివరం ఈ కథనంలో! చదువుండ్రి!
మా ఊరు మా కథ తగ్గేదేలే...
అదుపు తప్పిన భాష అనర్థాలకు హేతువు...


ఆయనొక పోలీసు ఉన్నతాధికారి..ఆరిలోవ సీఐ..విధుల్లో ఉన్నారు.అప్పుడే అక్కడకు అంటే శారదా పీఠం దగ్గరకు మంత్రి సీదిరి అప్పల్రాజు వచ్చారు.తనను అనుమతించాలని కోరారు.మీరు వెళ్తే వెళ్లండి కానీ అనుచరులకు మాత్రం నో వే అని చెప్పారు. ఇదొక్కటే ఆయన పాపం అయింది.అంతే! ఇక ఆ మంత్రి  రెచ్చి పోయారు. విశాఖ పర్యటనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా.. చోటు చేసుకున్న రగడ పెను వివాదాలకు తావిచ్చేలా ఉంది. వివాదాస్పద మంత్రి సీదిరి  తనదైన దురుసుతనంతో దూకుడు స్వభావంతో సీఐపై చేయిచేసుకున్నారు. పోలీసులను ఉద్దేశించి దుర్భాషలాడారు.



అంతేకాదు పోలీసు కమిషనర్ వచ్చి తమకు క్షమాపణలు చెప్పాలన్నారు.ఇవన్నీ జగన్  చూస్తున్నారా లేదా చూసీ చూడని విధంగా వదిలేస్తున్నారా? ఓ మంత్రి విధుల్లో ఉన్న సీఐను తిట్టడమేంటి? అది చూసి తోటి పోలీసులు ఊరుకోవడం ఏంటి? అసలు యూనిఫాం బేస్డ్ పబ్లిక్ సర్వెంట్ కు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా! ఆయనకు కూడా యూనిఫాం బేస్డ్ పబ్లిక్ సర్వెంటే కదా! ఒకప్పుడు తెల్లని కోటు వేసుకుని వైద్యం అందించి శ్రీకాకుళం జిల్లా, పలాస ప్రాంతం (మంత్రి సొంత నియోజకవర్గం ఇదే) నుంచి ఎదిగి వచ్చిన వారే కదా! ఆ రోజు వైద్యునిగా ఎంత మంచి పేరు ఉందో ఈ రోజు మంత్రి గా ఆయనకు అంత చెడ్డ పేరు ఉంది.టీడీపీ హయాంలో దురుసుగా వ్యవహరించినా కూడా వైసీపీ నాయకుడిగా ఉన్న ఈయనను ఆ రోజు కూడా పోలీసులు క్షమించేశారు. ఇదే హవా ఇప్పుడూ నడుస్తోంది.


ఆ రోజు ఆయనకు టీడీపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయేమో! మరి! ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక, తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు మంత్రి అయ్యే అవకాశం వచ్చింది.అనూహ్యంగా వచ్చింది.మోపిదేవిని, పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఆ రోజు శాసన మండలి రద్దు చేయాలన్న నిర్ణయం ప్రకారం ఆఘమేఘాల మీద వాళ్లతో రాజీనామాలు చేయించి తరువాత వారిద్దరినీ రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే! జగన్ కు ఎంతో దగ్గరగా ఉండే ఇంకా చెప్పాలంటే అక్రమాస్తులతో భాగం ఉంది అని ఆరోపణలు ఎదుర్కొంటున్న, కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించిన మోపిదేవి వెంకటరమణ స్థానంలో మంత్రి సీదిరి అప్పల్రాజు వచ్చారు. మత్స్యశాఖకు, పశుసంవర్థక శాఖకు మంత్రి అయ్యారు.


అప్పటి నుంచి జిల్లాలో బాగా పాపులర్ అయ్యారు. జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా రెబల్ మినిస్టర్ గా మంచి పేరే తెచ్చుకున్నారు. అంతేకాదు ఒడిశాతో మనకున్న సరిహద్దు వివాదాలపై కూడా బాగానే మాట్లాడారు.దీంతో ఇంకా మంత్రి పేరు జగన్ దగ్గర ఫేమస్ అయిపోయింది.ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన హవాకు ఢోకా లేదు.మంత్రి వర్గ విస్తరణ అయితే ఆయనను తప్పించేందుకు ఛాన్స్ ఉంది అన్న వార్తలొచ్చినా ఇప్పట్లో ఆ ప్రతిపాదన కానీ ఆ ఊసు కానీ ఆ ఊహ కానీ జగన్ కు లేకపోవడంతో ఇక ఆయనకు ఎదురేముంది.స్వభావ రీత్యా బాగా దూకుడున్న వ్యక్తి.. వాగ్ధాటి ఉన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుకరిస్తారు ఎక్కువగా ప్రసంగాల్లో! ఏం మాట్లాడినా కాస్త కటువుగా ఉంటుంది.టీడీపీని టార్గెట్ చేసినా, గౌతు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినా  కూడా భాష విషయంలో అదుపు తప్పే ఉంటుంది. ఇవి కాకుండా ఆయనకు కోపం ఎక్కువ అన్న టాక్ కూడా ఉంది.లాక్డౌన్ వేళల్లో కూడా ఓ సందర్భంలో  విధుల్లో ఉన్నపోలీసులను ఆయన దుర్భాషలాడారు.ఇంకా చెప్పాలంటే స్వభావ రీత్యా  పౌర సరఫరాల శాఖ మంత్రి  కొడాలి నానిని మాదిరిగా ఉంటారు. ఎవడైతే నాకేంటి అన్న ధోరణి కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తుంది.అన్ని సందర్భాల్లోనూ కాదు. ఇదొక్కటి తెలుసుకుంటే మేలు.

- రత్నకిశోర్ శంభుమహంతి


మరింత సమాచారం తెలుసుకోండి: