ఇండ‌స్ట్రీ అంతా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మ‌నుషులే నిండి ఉన్నారు.అమ‌రావ‌తి బొమ్మ‌లు త‌యారు చేసి ఇచ్చింది కూడా క‌మ్మ పెద్ద‌లే! క‌నుక అమ‌రావ‌తి విష‌య‌మై జ‌గ‌న్ త‌న రాజ‌కీయ ప్ర‌సంగాల్లో కూడా రాజ‌మౌళి పేరును,బోయ‌పాటి పేరును ప‌దే ప‌దే ప్ర‌స్తావించేవారు.ఆయ‌నే కాదు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా చాలా సంద‌ర్భాల్లో శాస‌న‌స‌భ‌లో రాజ‌మౌళి పేరును ఇంకా ఇంకొంద‌రి పేర్ల‌ను ప్ర‌స్తావించారు కూడా! రాజ‌ధాని 3డీ బొమ్మ కాదు అని! దీంతో ఎప్ప‌టి నుంచో క‌మ్మ ప్రాబల్యం ఉన్న ఇండ‌స్ట్రీని త‌న దారికి తెచ్చుకునేందుకు రెడ్డి సామాజిక‌వ‌ర్గంకు చెందిన సీఎం త‌న ఎత్తుగ‌డ‌ను విజ‌య‌వంతంగా వేశారు. దీంతో టికెట్ రేట్ల పేరిట పెద్ద నాట‌కాన్నే న‌డిపారు.ఇదే వైసీపీ ఆ రోజు బాహుబ‌లి సినిమాను ఎందుకు ప్ర‌మోట్ చేసింది అని..జ‌గ‌న్ సొంత మీడియాలో ఫుల్ పేజీ ఇంట‌ర్వ్యూలు ఎందుకు ఇచ్చింద‌ని? ఎందుకని గంటలు గంట‌లు త‌ర‌బ‌డి బాకాలు ఊదింద‌ని..ఎందుకంటే అదొక అటెన్ష‌న్ పాయింట్ క‌నుక..క‌మ‌ర్షియాల్ వాల్యూ క‌నుక...

ఇక తొలిరోజుల నుంచి ఇప్ప‌టిదాకా సాక్షి ఫ్యామిలీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో మంచి సంబంధాలే నెర‌పింది.డ‌బుల్ ధ‌మాకా పేరిట వార్త‌లు ఇచ్చింది. మెగా బ్ర‌ద‌ర్స్ తో ట్రిపుల్ ధ‌మాకాకు ప్లాన్ చేసింది.ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి రానంత వ‌ర‌కూ సాక్షి తన‌దైన క‌వ‌రేజీని ఆయ‌న‌కు కూడా ఇచ్చింది.ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాగానే సీన్ మారిపోయింది. సాక్షి స్వ‌రం మారిపోయింది.దాంతో ఇండ‌స్ట్రీలో కొంద‌రు జ‌గ‌న్ కు వ్య‌తిరేకులుగా మారిపోయారు.

రాఘ‌వేంద్ర‌రావు కానీ సురేశ్ బాబు కానీ మిగ‌తావాళ్లెవ్వ‌రూ కూడా పెద్ద‌గా జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాట్లాడేందుకు మొద‌ట్నుంచి ఇష్ట‌ప‌డ‌డం లేదు. కానీ వీళ్లంతా టీడీపీ హ‌యాంలో బాగానే ఉన్నారు. విశాఖ స్టూడియో కు స్థ‌లం కేటాయింపు చేసిందే తెలుగుదేశం పార్టీ.ఆ స్థ‌లం వివాదంలోనే వైసీపీకి, సురేశ్ బాబుకు వివాదాలు వ‌చ్చాయి. అవే ఇవాళ టికెట్ వివాదానికి దారి ఇచ్చాయి. క‌నుక రేప‌టి వేళ విశాఖ కేంద్రంగా క‌మ్మ సామాజిక‌వర్గం నేతృత్వంలో స్టూడియోలు వ‌చ్చినా వాటిపై రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఆధిప‌త్యం అన్న‌ది త‌ప్ప‌దు. అందుకే ఈ రెండు సామాజిక‌వ‌ర్గాల పోరులో ప‌వ‌న్ ఓడిపోతున్నాడు అన్న‌ది నిజం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: