ఏపీ ప్రజలకు చల్లని వార్త.. గత కొన్ని రోజులుగా భారీ ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఊరట కలిగించే విషయం. మరి కొద్ది గంటల లో భారీ వర్షాల తో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం, కోరుకొండ, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, ఏలేశ్వరం, అన్నమయ్య జిల్లాలోని వీరబల్లి, రామాపురం,రాయచోటి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె మండలాలు, వాటి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని అమరావతి వాతావరణ  శాఖ కేంద్రం హెచ్చరించింది.


ఆ ప్రాంతాల్లొ బయట పని చేస్తున్న వారికి బయటకు వేళ్ళకూడదని హెచ్చరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల కు వెళ్ళడం మంచిదని తెలిపారు.రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. గరిష్ఠ స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం తో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధికంగా విజయవాడ లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అనకాపల్లి లో అత్యల్పం గా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమి కి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతూన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కాసేపు చల్లగా వున్న కూడా మళ్ళీ యదావిధిగా ఎండలు మండి పోతున్నాయి..


పెరుగుతున్న ఎండతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటే భయపడుతున్నారు. ఉష్ణోగ్రత లు 44 డిగ్రీలు దాటడం తో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ఎండలు భారీగా నమోదు అవుతూన్నాయని అధికారులు అంటున్నారు.. ముఖ్యంగా మే నెల లొకి అడుగు పెట్టగానే జనాల కు టెన్షన్ మొదలైంది. ఎండలు మండి పోతున్నాయి. అదే విధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా రోజు రోజుకు పైకి చేరుతున్నాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కూడా భారీ గా నమోదు అవుతూన్నాయని అధికారులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: