ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడున్నరేళ్లు గడిచిన ఈ ప్రభుత్వం గురించి నాలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పైగా రాజకీయ విశ్లేషకులు ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలవడం కాస్త కష్టమే అంటూ జ్యోతిష్యాలు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్ రాబోయే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎన్నికలలో గెలవడానికి అవసరం అయిన అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల లాగానే జగన్ కూడా ప్రస్తుతం పార్టీ గురించి మరియు ఇప్పటి వరకు జరిగిన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయం గురించి ప్రశాంత్ కిషోర్ ను సర్వే చేయించి నివేధిక కోరడం జరిగింది.

అయితే ఇప్పటికే ఈ సర్వే పూర్తి అయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సర్వే లో తెలిసిన కొన్ని విషయాలు జగన్ ను నిద్ర లేకుండా చేస్తున్నాయట. సర్వే లో ఎక్కువ మంది ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం పనితీరు సరిగా లేదని, అసలు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదని నొక్కి చెబుతున్నారట. ఇంకొందరు అయితే రాష్ట్రము సెపరేట్ అయి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా రాజధానిని నిర్మించకపోవడం చాలా బాధాకరం అంటూ గత ప్రభుత్వంపైనా మరియు ప్రస్తుతం ప్రభుత్వం పైనా విమర్శలు చేశారట. గోదావరి జిల్లాల ప్రజలు అయితే వ్యవసాయానికి ప్రధానం అయిన పోలవరం ప్రాజెక్టును ఇంత వరకు పూర్తి చేయలేదంటూ విరుచుకు పడ్డారు అట..

ఇలా ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి గడ్డు కాలం తప్పదని తెలుస్తోంది. పైగా ఎమ్మెల్యే లు ఎంపీల భవితవ్యం గురించి కూడా ప్రజలు చెప్పినట్లు తెలిసింది. దాదాపుగా 70 నుండి 80 ఎమ్మెల్యే ల గురించి ప్రజల్లో మంచి అభిప్రాయం లేదట. వారిని ఇప్పటికే జగన్ మందలించినట్లు సమాచారం. మరి ఇన్ని వ్యతిరేకతల నడుమ సీఎం జగన్ ఏ విధంగా పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా నడిపిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: