ఇక అసలు విషయానికొస్తే.. భీమ్లా నాయక్ సినిమా.. పవన్ కల్యాణ్ కి, బీజేపీకి మధ్య బంధాన్ని బలహీనం చేసిందనే వార్తలు వినపడుతున్నాయి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణలో బీజేపీ బద్ధశత్రువైన టీఆర్ఎస్ నాయకులను పిలిచారు పవన్ కల్యాణ్. టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆ పార్టీ నాయకులు కూడా భీమ్లా నాయక్ ఈవెంట్ కి వచ్చారు. ఇటు ఏపీలో కూడా జగన్ పై కోపంతో కేసీఆర్ తో పవన్ కలసి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలు అనుకుంటే పొరపాటే.. ఎడబాటు మాత్రం గ్యారెంటీ అని తేలిపోయింది.
వకీల్ సాబ్ సిినిమా విడుదల సమయంలో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ టైమ్ లో బీజేపీ నేతలు వకీల్ సాబ్ సినిమా చూశారు, దానికి అనుకోని హైప్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో మాత్రం బీజేపీ పూర్తిగా సైలెంట్ గా ఉంది. భీమ్లా విషయంలో బీజేపీ ఎక్కడా నోరు మెదపలేదు. రాజకీయ పార్టీ సిినిమాని పట్టించుకోవాలని లేదు కానీ.. ఏపీలో అంత గొడవ జరుగుతున్నా టీడీపీ నాయకులు, పవన్ కి సపోర్ట్ ఇచ్చారే కానీ, బీజేపీ నుంచి గొంతు పెగల్లేదు. కనీసం పవన్ ని తొక్కేస్తున్నారనే కామన్ డైలాగ్ కూడా రాలేదు. కారణం ఏంటి..? భీమ్లా ఫంక్షన్ కి టీఆర్ఎస్ నేతల్ని పిలిచిన పవన్.. బీజేపీ వాళ్లని పూర్తిగా అవమానించారు. దీంతో వారి ఇగో హర్ట్ అయింది. అందుకే కాషాయ పార్టీ తరపున ఎలాంటి హైప్ లేదు. సినిమానే కాదు వాళ్లు పవన్ కల్యాణ్ ని కూడా కాస్త దూరం పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం. అంతకు ముందున్న జిగిరీ దోస్తీ ఇప్పుడు లేదు. ఇంకా చెప్పాలంటే వేరుదారులు పడ్డాయనడానికి ఇదే నాంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి