
అయితే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యాని కోట్లాదిమంది క్రిస్టియన్స్, హిందువులు, ముస్లిమ్స్ కూడా మాట్లాడుతున్నారు.. వీటన్నిటినీ కూడా నోరు మూయించేందుకే ఇలా పాస్టర్లకు గుడ్ న్యూస్ అంటూ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులను క్రిస్టియన్స్ గా మారుస్తున్నారంటున్న చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు.. అ తర్వాతే పవన్ కళ్యాణ్ కూడా అన్నిటిని మొదలు పెట్టారని..ఇప్పుడు ఎనిమిది వేల మంది పాస్టర్లకే 5000 రూపాయలు ఇస్తే మరి 80000 మంది ఉన్న పాస్టర్ల సంగతి ఏంటి అంటూ నిలదీయడం జరిగింది.
అలాగే వేల మంది ఉన్న మౌలానాలు హిందూ ప్రీస్ట్ పరిస్థితి ఏంటి అంటూ అడగడం జరిగింది. ఆర్టికల్ -14 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి కదా అంటూ తెలిపారు.ఇక ఎవరైనా మన ఆత్మను మనం అమ్ముకుంటామా చంద్రబాబునాయుడు ఆయన సొంత డబ్బుతో ఏమీ ఇవ్వలేదు కదా.. అంటూ ఇలా తీశారు లక్ష రూపాయలు కూడా చేతిలో లేని చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల అధిపతి ఎలా అయ్యారో అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం అంటూ తెలిపారు. ఎవరు కూడా అమ్ముడుపోవద్దని కలిసి పోరాటం చేసి మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందామంటూ కేఏ పాల్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.