వచ్చే ఎన్నికలకు టిడిపి ఇప్పటి నుంచే తన గ్రౌండ్ గట్టిగా ప్రిపేర్ చేస్తుందా ? కడప గడపలో వైసిపి ఖాతా తరవకుండా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిందా ? పులివెందుల సీట్ ను కూడా టిడిపి గెలుచుకో బోతుందా ? జగన్ జైల్లో చెప్పకూడు తినడం ఖాయమని మహానాడు సాక్షిగా చంద్రబాబు సంకేతాలిస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి .. జగన్ రెడ్డి సొంత జిల్లా మహానాడులో .. మొదటిసారి మహానాడు ను టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది .. అలాగే ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయటం వెనుక పెద్ద స్కెచ్ ఉంది .. గత ఎన్నికల్లో కడపలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి ఏకంగా ఏడు స్థానాలు గెలుచుకుంది .


బలంగా ఉండే కడప జిల్లాలోని వైసీపీ కేవలం మూడింటి మూడు స్థానాలకు పరిమితం చేశారు . అంటే కూటమి వేవ్ ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు .. ఇక ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇంకాస్త కష్టపడితే వైసీపీకి ఉన్న మూడు సీట్లు కూడా వచ్చేవి కావున్నారు .. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా పాగా వేయాలని ఆయన చెప్పకనే చెప్పేశారు .. జగన్ సొంత ఇలా కాలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వెనక కారణాలు చాలానే ఉన్నాయి అని కూడా అంటున్నారు .. జగన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వాదన కూడా ఉంది .. జగన్ పై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి ..


అలాగే అక్రమాస్తుల కేసులో జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్ళవచ్చు ..  ఇది ఒకటేనా లిక్కర్ స్కామ్ కేసు కూడా ఇప్పుడు రెడీగా ఉంది . ఈ కేసు ఆయన మెడకు చుట్టుకుని అవకాశం గట్టిగా కనిపిస్తుంది .. జగన్ జైలుకు వెళితే గతంలో లాగే చెల్లి తల్లి పార్టీని ముందుకు నడిపించే అవకాశం లేదు .. భార్య అన్ని తానే నడిపించిన ఆమెకు ప్రజల  పల్స్ ను పసిగట్టెంత  సీన్ లేదు అనేది కూడా ఓపెన్ సీక్రెట్ .. ఇప్పటికే వైసీపీలో ఉన్న మిగిలిన నాయకులు ఇంకెవరికైనా వైసీపీని నడిపించే సామర్థ్యం దమ్ము ఉందా అంటే అది ఎవరికీ లేదు .. ఇక దీంతో వైసిపి ఫ్యూచర్ ని అంచనా వేసే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కడపలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఈ మహానాడు వేదికగా కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: