
ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం మేడిగడ్డ నుంచి ఐదేళ్లలో 162 టీఎంసీల నీటిని ఎత్తిపోశారని చెబుతున్నారని, కానీ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు లిఫ్ట్ చేసిన నీటి గురించి ఎందుకు మాట్లాడరని హరీశ్ ప్రశ్నించారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్ హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీటి వివరాలను దాచడం ఎందుకని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీ, అన్నారం నుంచి 172.86 టీఎంసీ, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీ, నంది మేడారం నుంచి 181.70 టీఎంసీ, గాయత్రి నుంచి 179.41 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసినట్లు హరీశ్ వెల్లడించారు.
హరీశ్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాజెక్టు అయినా మొదటి దశలో పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదని, ఇది అందరికీ తెలిసిన విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తోక పనులు మొదలుపెట్టి, హెడ్ వర్క్స్‌ను విస్మరించిందని, కమిషన్ల కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ తప్పిదం కాంగ్రెస్‌కే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు