ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఓవైపు ప్రభుత్వ పక్షాన ఎమ్మెల్యేలు నాయకులు తమ పనితీరుపై సర్వేలు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ? అనేదానిపై ఎప్పటికప్పుడు నివేదికలు చూస్తూ వారిని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే కొందరు సింగల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని వార్నింగ్లు కూడా ఇచ్చారు. మరి ప్రతిపక్ష వైసిపి ఏం చేస్తుంది ? ఆ పార్టీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల పనితీరు అంచనా వైసిపి ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి కరం. ఎందుకంటే ఎవరికివారు తమ గతం ఎలా ? ఉందో దానికి ప్రజల ఆమోదం ఎలా ఉందో ? తెలుసుకుంటే దానిని బట్టి భవిష్యత్తుకు అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంటుంది.
దాని ప్రకారం ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు ఆ తరహా ప్రణాళికలు వేసుకుంటాయి ఈ రూపంలో చూసుకుంటే వైసీపీ తనకున్న 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంచనా వేసుకుందా అంటే లేదనే చెప్పాలి. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు. ఒకరిద్దరిని మినహాయిస్తే అసలు ఎవరికీ సరైన ప్లానింగ్ సరైన మార్గ నిర్దేశికత్వం లేదు.. జగన్ కూడా వీరిని ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాదికాలంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ప్రజల మధ్యకు వచ్చారు ? ఎంతమంది కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు ? ఎంతమంది మీడియా ముందు గళం ఎత్తారు అనే ప్రశ్నించుకుంటే ? ఒకరిద్దరు మినహా ఎవరు అసలు తమ పదవులు పట్ల .. తమ నియోజకవర్గ పట్ల ఏమాత్రం ఆసక్తితో లేరని అర్థమవుతుంది. వీరిలో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో మీరు గెలుపు కచ్చితంగా కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు