
అయితే ఇలాంటి వాటి మీద సాధారణంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ ఉంటుంది.. అలా తాజాగా కుప్పంలో జరిగిన సంఘటన పైన కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ కేసును సుమోటోగా తీసుకొని.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నోటీసులను జారీ చేసింది. అయితే ఈ విషయం పైన సీఎం చంద్రబాబు కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన పైన కూడా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడంతో ఏపీ అంతట తీవ్ర చర్చనీయంశంగా మారింది ఈ సంఘటన.. కేవలం 80000 రూపాయలు ఇవ్వాల్సిన నేపథ్యంలో మహిళా కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారని అంతేకాకుండా తన కుమారుడి చదువు కోసం టిసి కోసం వచ్చిన మహిళను ఇలా చెట్టుకు కట్టేసి హింసించి డబ్బులు వసూలు చేయడం అన్నది ఏపీలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా వైరల్ గా చేయడంతో ఆ మహిళకు అండగా ఉంటామంటూ సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం కూడా నిలిచింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంటూ తెలిపారు చంద్రబాబు.