
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి మరో ఐదు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ నుంచి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెలలోనే మృతి చెందారు. ఇక్కడ సీటు ఖాళీ అయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నోటీసు వెళ్లింది. బిహార్ ఎన్నికలతో కలిసి ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారని అంటున్నారు. ఇక గోపీనాథ్ 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి .. అక్కడ కూడా 2018 - 2023 ఎన్నికల్లోను వరుసగా బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పాగా వేయాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.
సాధారణ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి .. కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇక్కడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరు ? పోటీ చేస్తారన్న దానిపై పార్టీ వర్గాల్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దివంగత గోపీనాథ్ భార్య సునీతకు సీటు ఇస్తే సామాజిక వర్గ సమీకరణలతో పాటు.. సానుభూతి ఉంటుందని బీఆర్ఎస్ ఆలోచనగా టాక్ ? అలాగే ఇక్కడ కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా సీటు కావాలంటున్నారు. మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు అయిన విష్ణుకు ఇక్కడ మైనార్టీలు.. బస్తీలలో మంచి పట్టు ఉంది. అలాగే 2014 లో ఇక్క బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రావుల శ్రీధర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరికి బీఆర్ ఎస్ సీటు దక్కుతుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు