ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ల పంపిణీపై శాసన మండలిలో అడిగిన ప్రశ్నలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. పెన్షన్ లను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసినా, ఆ తర్వాత నాలుగు వేలు చేసినా, 15 వేల వరకు పెన్షన్ అందిస్తోన్న ఘనత తెలుగుదేశం పార్టీ, ఎన్డియే ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేసారు. ఇచ్చిన హామీ ప్రకారం, ప్రతీ నెల 1వ తేదీన పేదల పండుగా పెన్షన్ లను పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఏ విధమైన భేషజాలు లేకుండా పెన్షన్ లను ప్రతీ ఒక్క అర్హుడికి అందిస్తున్నామని తెలిపారు.


50 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ లకు పంపిణీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. చేనేత కార్మికులకు, వితంతువులకు, మత్స్యకారులకు, కల్లు గీత కార్మికులకు, డప్పు కళాకారులకు, ఆదివాసి గిరిజనులకు, ఒంటరి మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ లను మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదేనని మంత్రి స్పష్టం చేసారు. పెంచుకుంటూ పోతామని ప్రజలను మభ్య పెట్టలేదన్నారు కొండపల్లి. హీమోఫిలియా వ్యాధి గ్రస్తులకు వయస్సుతో సంభంధం లేకుండా పించన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.


ఎవరైనా ఊరు నుంచి అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్తే గత ప్రభుత్వంలో వారికి పెన్షన్ తొలగించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో వారికి మూడు నెలలు సమయం ఇచ్చి, వారు వచ్చి ఒకేసారి పెన్షన్ తీసుకునేలా ఏర్పాటు చేసామని వెల్లడించారు. ఈ విధంగా మార్పులు చేయడం వలన ఇప్పటి వరకు 8,63,216   పింఛన్ దారులకు 731.17  కోట్ల అమౌంట్ ను చెల్లించడం జరిగిందని తెలిపారు. నవంబర్ 2024 నుండి ప్రతినెలా స్పౌజ్ పెన్షన్స్ మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: