సాధారణంగా ఒక సినిమాలో కథ, కథనం బాగుంటే సినీ ఇండస్ట్రీలో ఏ భాషలో అయితే విడుదల చేస్తారో, ఆ భాషలో మాత్రమే ప్రాధాన్యత పొందుతూ ఉంటారు సినీ నటులు. కానీ కేవలం ఒకే ఒక్క సినిమాతోనే దేశమంతటా ఖ్యాతి పొందడం అంటే అది కేవలం జే. వీ .సోమయాజులు గారికే చెందింది. ఆ పేరు వినగానే చాలు.. ముందుగా మనకు శంకరాభరణం సినిమా గుర్తొస్తుంది. ఇక ఈ సినిమా ద్వారానే ఆయన దేశవ్యాప్తంగా పేరు పొందారు. ఇక ఈయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈయన 1928 జూన్ 30వ తేదీన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం  లుకాలం గ్రామంలో శారదాంబ, వెంకట శివరావు దంపతులకు జన్మించారు.


ఈయన సోదరుడు చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నటుడు. ఇక ఈయన తండ్రి వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విజయనగరంలో చదువును కొనసాగించాడు. చదువుకునేటప్పుడు నాటకాలు కూడా వేసేవారు. అలా తన తమ్ముడు రమణ మూర్తి తో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 ఏళ్లలో మొత్తం అయిదు వందల ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో రామప్ప పంతులు పాత్రకు ప్రసిద్ధుడు సోమయాజులు. ఈ నాటకాలాన్నింటికి ప్రోత్సహించింది కేవలం ఈయన తల్లి శారదాంబ గారు.


స్వయంకృషితోనే నటన ప్రస్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఈయన కుటుంబం అంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు, 42 వ భారత స్వాతంత్ర్య సంగ్రామం, మొదటి రెండు ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, నాటకరంగాన్ని విస్మరించకుండా నిబద్ధతతో నాటకరంగానికి పరిమితమయ్యారు. ఇక అలా ఎన్నో నాటకాలలో నటించి, ఎన్నో బహుమతులు కూడా గెలిచారు. ఈయన మహబూబ్ నగర్ లో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజుల్లోనే శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.  ఇక ఈ సినిమాకు దర్శకుడు యోగి రూపొందించిన రాధాకృష్ణ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఇక శంకరాభరణం సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక దీని తరువాత ఏకంగా 150 సినిమాలలో రకరకాల పాత్రలు పోషించి, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.


1993 మార్చి ఎనిమిదవ తేదీన రసరంజని నాటక కళా సంస్థను కూడా నెలకొల్పారు. ఇందులో ప్రతిరోజు నాటకాన్ని ప్రదర్శించాలని, టికెట్ కొని నాటకాలు చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. ఎన్నో చిత్రాలలో మంచి గుర్తింపు పొందిన ఈయన, టీవీ సీరియల్స్ లో కూడా ఎన్నో పాత్రల్లో నటించారు. ఇక తను రిటైర్ అయ్యేనాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టర్ గా కూడా పని చేసాడు. 2004 ఏప్రిల్ 27వ తేదీన ఈ లోకం నుండి నిష్క్రమించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: