క్రికెట్ గురించి క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే క్రికెట్ అంటే కేవలం అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ పంచే అఫీషియల్ ఆట మాత్రమే కాదు ఇక గల్లీలో చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆడుకునే బస్తి ఆటగా కూడా గుర్తింపు సంపాదించింది అని చెప్పాలి. ఇలా గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రికెట్ ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ పంచుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక క్రికెట్లో ఎలాంటి రూల్స్ ఉంటాయి అన్నది కూడా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.


 అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న రూల్స్ కి అటు గల్లీ క్రికెట్ లో ఉన్న రూల్స్ కి చాలా తేడా ఉంటుంది. అయితే ఇక క్రికెట్ గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఏంటో టక్కున చెప్పేస్తూ ఉంటారు. ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ లో అందరికంటే మంచి ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కట్టబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో అయితే ఇలా మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన క్రికెటర్లకు కొంత ప్రైజ్ మనీని ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్లేయర్ కి ఇచ్చిన బహుమతి కాస్త వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇప్పుడు వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా  నిలిచిన ప్లేయర్కు నగదు లేదా షీల్డ్ బహుమతిగా ఇవ్వడం మాత్రమే చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక చేపను మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డుగా ఇచ్చేశారు. కాశ్మీర్ లోని టేకి పోరా కుప్వోరాలో ఈ ఘటన జరిగింది. ఇటీవల అక్కడ జరిగిన టోర్నమెంట్లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గా 2.5 కేజీల చేపను అందించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. టోర్నమెంట్ ఫేమస్ అయ్యేందుకు ఇలా చేసినట్లు టోర్నమెంట్ నిర్వాహకులు చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: