
సుమ:
బుల్లితెర యాంకర్ గా మకుటం లేని మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న సుమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా టీవీ షో లతో అలరిస్తున్న సుమ అప్పుడప్పుడు సినిమాలలో కూడా అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు సినిమా ఫంక్షన్ లో నైనా ఎంత పెద్ద ఈవెంట్లు అయినా సరే ఒక్క హ్యాండిల్ తో సక్సెస్ చేస్తూ ఉంటుంది. అంతటి సమయస్ఫూర్తి నైపుణ్యం కలిగిన సుమ ఒక్క ఆడియో ఫంక్షన్కు రూ.3లక్షల వరకు చార్జ్ చేస్తుందని సమాచారం.
అనసూయ:
యాంకర్స్ లో సుమా తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె జబర్దస్త్ లో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత వెండితెరపై పలు పాత్రలు పోషిస్తూ అందంతో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కు 2 లక్షల రూపాయలు తీసుకుంటుంది.
రష్మీ గౌతమ్:
యంగ్ యాంకర్స్ లో బుల్లితెర ప్రేక్షకులలో తనకంటూ స్పెషల్ ఇమేజె సొంతం చేసుకున్న స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ దశాబ్ద కాలంగా టీవీ ఆడియన్స్ను అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ ఈవెంట్ లకు రూ.1.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందని సమాచారం.
శ్రీముఖి:
బుల్లితెరపై తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు.. అందం, చురుకుతనం , సమయస్ఫూర్తి, యాక్టింగ్ స్కిల్స్ ఆమె సొంతం ఇప్పుడు గ్లామర్ షో తో ఆకట్టుకుంటున్న ఈమె లక్ష రూపాయలకు పైగా ఒక్కో ఈవెంట్ కి చార్జ్ చేస్తుందని తెలుస్తుంది.